ఇంటి గడప దగ్గర కబుర్లు చెప్పుకుంటున్న వారిపైకి దూసుకొచ్చిన మృత్యువు.. నలుగురి దుర్మరణం

  • కడప జిల్లా మద్దిమడుగులో ప్రమాదం
  • మంచంపై కూర్చుని ఉండగా ఢీకొట్టిన కారు
  • ఇద్దరు స్పాట్ లోనే మృతి
  మృత్యువు ఎక్కడి నుంచి ఎవరిపైకి వస్తుందో చెప్పలేని రోజులివి. కడప జిల్లా చింత కొమ్మదిన్నె మండలం మద్దిమడుగులో అలాంటి ప్రమాదమే జరిగింది. ఇంటి గడప దగ్గర మంచం మీద కూర్చుని మాట్లాడుకుంటున్న వారిపైకి ఓ కారు అతి వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. మృతులను దేవి (27), అమ్ములు (30), అమ్ములు భర్త కొండయ్య (45), లక్ష్మీదేవి (35)గా గుర్తించారు. వాళ్లంతా కొండయ్య ఇంటి గడప మీద కూర్చుని మాట్లాడుకుంటుండగా ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. కొండయ్య, లక్ష్మీదేవి ఘటనా స్థలంలోనే మరణించగా.. అమ్ములు, దేవిలను కడప రిమ్స్ కు తరలిస్తుండగా దారి మధ్యలో చనిపోయినట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Road Accident
Andhra Pradesh
Kadapa District

More Telugu News